బీజేపీలో చేరిన సాధినేని యామిని

బీజేపీలో చేరిన సాధినేని యామిని

టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ ఇవాళ(శనివారం) బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లోని  కడప జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. గజేంద్ర షెకావత్‌ ఆమెకు పార్టీ  కండువా కప్పి కమల దళంలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదినారయణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌, సుజనా చౌదరితో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.

గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న యామినీ శర్మ బీజేపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.