సద్దుల బతుకమ్మ సందడి

సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో  ఏడో రోజే సద్దుల బతుకమ్మ నిర్వహించారు.  జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఏడో రోజున సద్దుల బతుకమ్మ ఆడడం ఇక్కడి ఆనవాయితీ. మండల కేంద్రమైన చిన్నకోడూరుతో పాటు మాచాపూర్, అల్లీపూర్, మెట్​పల్లి, కస్తూరిపల్లి, మందపల్లి, నంగునూరు, మిరుదొడ్డి, సిద్దిపేట, కొండపాక మండలాల్లోలని పలు గ్రామాల్లో మంగళవారం సద్దుల బతుకమ్మ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా తయారు చేసిన బతుకమ్మలను గ్రామాల్లోని  పలు కూడళ్లలో పెట్టి ఆట, పాటలతో అలరించారు. చిన్నకోడూరు లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో  ఎమ్మెల్యే హరీశ్​రావు సతీమణి శ్రీనిత పాల్గొన్నారు. అనంతరం చెరువుల్లో వాటిని నిమజ్జనం చేశారు.

 

- సిద్దిపేట, వెలుగు, ఫొటోగ్రాఫర్