మెదక్ జిల్లాలో సద్దుల బతుకమ్మ సందడి

ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయే చందమామ.. రామ రామరామ ఉయ్యాలో... రామనే శ్రీ రామ ఉయ్యాలో అంటూ మహిళల పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా గురువారం మహిళలు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో ఆయా వార్డుల్లో పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.

చిన్నారులు, మహిళల కోలాటాల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనితారావు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి స్థానిక కోమటి చెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీపీ అనురాధ, మెదక్​, సంగారెడ్డి ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.- వెలుగు, న్యూస్​నెట్​వర్క్​