1979 నుంచి 2003వరకు ఇరాక్ నియంతగా ప్రజల్ని వణికించిన సద్దాం హుస్సేన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సద్దాం హుస్సేన్ ఫోటోను 20డాలర్లకు అమ్మకానికి పెట్టింది అమెరికాకు చెందిన విష్ అనే ఈ కామర్స్ సంస్థ. ఈ ఫోటో కేవలం 20డాలర్లు మాత్రమే. తమ సంస్థ అన్నీ వస్తువులకు 60-80% డిస్కౌంట్ ఇస్తుంది. మిస్ చేసుకోవద్దు అంటూ పేర్కొంది.
చాలా చీఫెస్ట్ ఐటమ్. ఈ ఐటమ్ ను కొనుగోలు చేయండి. దీన్ని ఉరి తీయవచ్చు లేదా ప్రేమ్ కట్టించుకోవచ్చు’ అంటూ చేసిన విష్ ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
సద్దాం ఫోటోపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. సద్దాం ఫోటో కేవలం 20డాలర్లేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబర్ 30 న సద్దాంను ఉరితీశారు.
