మద్యానికి భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపానికి గురై..

  • మద్యానికి భార్య డబ్బులు ఇవ్వలేదని సూసైడ్
  • సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్లో ఘటన

పుల్కల్, వెలుగు: మద్యానికి భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి పురుగు మందు తాగి సూసైడ్  చేసుకున్నాడు. ఎస్సై పాటిల్  క్రాంతి కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్  మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన యేసు(36) మద్యానికి బానిసయ్యాడు. రోజు మద్యం తాగుతూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ.. భార్య సుమలతను మద్యానికి  డబ్బులు ఇవ్వమని వేధిస్తుండేవాడు. మంగళవారం డబ్బులు ఇవ్వమని భార్యను అడగగా, ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామంలోని దుర్గమ్మ గుడి వద్ద పురుగు మందు తాగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.