Arjun Tendulkar: గాడిన పడుతున్న సచిన్ తనయుడు.. 50 వికెట్ల క్లబ్‌లో అర్జున్

భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ 3 వికెట్లు పడగొట్టాడు.

లెఫ్ట్ ఆర్మ్ పేసరైన అర్జున్ 2021లో ముంబై తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఆ తరువాత అవకాశాలు రాక 2022/23 సీజన్‌లో గోవాకు తన మకాం మార్చాడు. ఇప్పటివరకు  41 వైట్ బాల్ మ్యాచ్‌ల్లో 51 వికెట్లు, 17 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 24 వికెట్లు, 24 టీ20లో 27 వికెట్లు పడగొట్టాడు.

Also Read : గొడవలో కోహ్లీదే తప్పని తేల్చిన మ్యాచ్ రిఫరీ.. భారీ జరిమానా

ఈ పేసర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు. 2021లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన అర్జున్.. అరంగ్రేటం చేయటానికి రెండేళ్ల సమయం పట్టింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో సచిన్ తనయుడు ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్( IPL 2025) మెగావేలంలో ముంబై యాజమాన్యం అతన్ని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 5 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టాడు.