నేటి నుంచి భక్తులకు అనుమతి
రోజుకు 5 వేల మందికి దర్శనం
కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ మస్ట్
క్వారంటైన్‌లో ఆలయ ప్రధాన పూజారి
శబరిమల: మకర జ్యోతి పూజల కోసం కేరళ శబరిమలలోని అయ్యప్ప సన్నిధానం తెరుచుకుంది. బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేసిన ఆలయ పూజారులు తలుపులు తెరిచారు. గురువారం ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. కరోనా కారణంగా రోజుకు కేవలం 5వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. మకరవిళక్కు పూజల్లో భాగంగా జనవరి 20 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. జనవరి 14 మకరవిళక్కు పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఏటా ఈ సీజన్‌లో లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటరు. ఈ ఏడాది కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. మరోవైపు ఆలయ ప్రధాన పూజారి(మెలసంతి) జయరాజన్ పోటి సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తారని అధికారులు చెప్పారు. ఇటీవల తనను కలిసిన ముగ్గురు వ్యక్తులకు మంగళవారం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారన్నారు. జయరాజన్ క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ రోజువారి పూజలకు ఎలాంటి ఇబ్బంది లేదని దేవస్థానం బోర్డు అధికారి చెప్పారు. ఇదిలా ఉండగా అయ్యప్ప ఆలయం సంప్రదాయం ప్రకారం సన్నిధానానికి ప్రధాన పూజారిగా నియమితులైన వ్యక్తి ఆ ఏడాది మొత్తం కొండపైనే ఉండాలి. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ వస్తే ఏంచేయాలనే విషయంపై బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు.
For More News..
2020ని మర్చిపోవాలె.. వీళ్లను మాత్రం యాదికుంచుకోవాలె..
కలెక్టర్ పేరుతో తెలంగాణలో ఊరు! ఎందుకు పెట్టారో తెలుసా?
ఈ ఏడాది ఎక్కువగా ఇవే వెతికిన్రు
