SA20 2025 Auction: ముగిసిన మినీ ఐపీఎల్ వేలం.. అమ్ముడుపోని సఫారీ కెప్టెన్

మినీ ఐపీఎల్, సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20, 2025) వేలం అట్టహాసంగా ముగిసింది. మంగళవారం(అక్టోబర్ 01) కేప్ టౌన్ వేదికగా జరిగిన ఈ వేలంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 4.30 మిలియన్ రాండ్(భారత కరెన్సీలో దాదాపు రూ. 2 కోట్లు) ధరకు MI కేప్ టౌన్ అతన్ని కొనుగోలు చేసింది. అయితే, ఈ వేలంలో ప్రొటీస్ జట్టు కెప్టెన్ టెంబా బవుమా అమ్ముడుపోకపోవడం గమనార్హం.

13 మందిని వరించిన అదృష్టం

115 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో సహా మొత్తం 188 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొన్నారు. వీరిలో 13 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అంతర్జాతీయ స్టార్లు టెంబా బావుమా, జోష్ లిటిల్, టోనీ డి జోర్జి వంటి వారి కోసం ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు. 

Also Read:-ఈ నెల 12న ఉప్పల్‌లో మ్యాచ్

వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు

  • రీజా హెండ్రిక్స్: R4.3 మిలియన్ (MI కేప్ టౌన్)
  • కోలిన్ ఇంగ్రామ్: R175 000 (MI కేప్ టౌన్)
  • మార్క్వెస్ అకెర్మాన్: R800 000(ప్రిటోరియా క్యాపిటల్స్)
  • రూబిన్ హెర్మాన్: R175 000 (పార్ల్ రాయల్స్)
  • విహాన్ లుబ్బే: R175000 (జోబర్గ్ సూపర్ కింగ్స్)
  • ఇవాన్ జోన్స్: R175000 (జోబర్గ్ సూపర్ కింగ్స్)
  • ఒకులే సీలే: R175000 (సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్)
  • రిచర్డ్ గ్లీసన్: R2.3 మిలియన్ (సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్)
  • డేన్ పీడ్ట్: R175000 (MI కేప్ టౌన్)
  • ఎవిన్ లూయిస్: R1.5 మిలియన్ ( ప్రిటోరియా క్యాపిటల్స్)
  • షమర్ జోసెఫ్: R425000 (డర్బన్ సూపర్ జెయింట్స్)
  • డగ్ బ్రేస్‌వెల్: R175 000 (జోబర్గ్ సూపర్ కింగ్స్)
  • కైల్ సిమండ్స్: R175 000 ( ప్రిటోరియా క్యాపిటల్స్)

బరిలో ఆరు జట్లు 

ఆరు జట్లు తలపడే ఈ టోర్నీ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ప్రాంచైజీల ఓనర్లు.. మన ఐపీఎల్ ఓనర్లే. 

  • ఎంఐ కేప్ టౌన్ 
  • పార్ల్ రాయల్స్
  • ప్రిటోరియా క్యాపిటల్స్  
  • సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 
  • జోబర్గ్ సూపర్ కింగ్స్
  • డర్బన్ సూపర్ జెయింట్స్