క్రికెట్ లో నేటి నుంచి మరో ఆసక్తికర సమరం అభిమానులను అలరించనుంది. మంగళవారం (డిసెంబర్ 10) నుంచి పాకిస్థాన్ తో సౌతాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి టీ20 నేడు తొలి టీ20 డర్బన్ వేదికగా ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సొంతగడ్డపై సఫారీలను పాకిస్థాన్ తట్టుకొని నిలబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఫార్మాట్ లో మొత్తం 3 టీ20 మ్యాచ్ లు జరుగుతాయి.
లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
సౌతాఫ్రికా, పాకిస్థాన్ టీ20 సిరీస్ అంటే క్రికెట్ ప్రేమికులు బాగా ఆసక్తి చూపిస్తారు. నేడు జరగబోయే మ్యాచ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ టెలివిజన్‌లో స్పోర్ట్స్ 18 - 1 ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో జియో సినిమాలో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
పాకిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టుకు హెన్రిచ్ క్లాసెన్ నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఇటీవలే శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడడంతో అతను ఈ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. మార్క్రామ్‌తో పాటు టెస్ట్ సిరీస్ లో ఉన్న టీ20 ఆటగాళ్లు మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, ట్రిస్టన్ స్టబ్స్ టెస్ట్ సిరీస్ కారణంగా దూరమయ్యారు. కీలక ఆటగాళ్ళు లేనప్పటికీ, దక్షిణాఫ్రికా టీ20 జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ టీ20 తర్వాత సఫారీల జట్టులోకి తిరిగి వచ్చారు.
పాకిస్థాన్ టీ20 స్క్వాడ్:
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సైమ్ షాహ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఘా, సుఫ్యాన్ మోకిమ్, తయ్యబ్ తాహిర్ మరియు ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్)
టీ20 సిరీస్ కు సౌతాఫ్రికా స్క్వాడ్:
హెన్రిచ్ క్లాసెన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నార్జే, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్‌వాన్సీ, తబ్రైజ్ స్హమ్‌నెస్సీ, తబ్రైజ్ స్హమ్నెస్సీ మరియు డెర్ డస్సెన్.