రెస్టాఫ్ ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రుతురాజ్‌‌‌‌‌‌‌‌

  • ఇరానీ కప్‌‌‌‌‌‌‌‌ బరిలో సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌, జురెల్‌‌‌‌‌‌‌‌, దయాల్‌‌‌‌‌‌‌‌!

న్యూఢిల్లీ : టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధ్రువ్ జురెల్‌‌‌‌‌‌‌‌, పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యష్ దయాల్‌‌‌‌‌‌‌‌ ఇరానీ కప్‌‌‌‌‌‌‌‌లో  బరిలోకి దిగనున్నారు. ఇందుకోసం ఈ ముగ్గురిని టీమిండియా నుంచి రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్టులో ఈ ముగ్గురికీ తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు అక్టోబర్ 1–5 తేదీల్లో  రంజీ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ముంబైతో లక్నోలో జరిగే ఇరాన్ కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రెస్టాఫ్ ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్ ఎంపికయ్యాడు. 

ఈ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఆంధ్ర క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికీ భుయ్‌‌‌‌‌‌‌‌కు చోటు దక్కింది. కాగా,  టీమిండియా నుంచి రిలీజ్‌‌‌‌‌‌‌‌ అయితే సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ తన హోమ్ టీమ్ ముంబైకి, జురెల్‌‌‌‌‌‌‌‌, దయాల్‌‌‌‌‌‌‌‌ రెస్ట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆడతారని బీసీసీఐ తెలిపింది. 
 
రెస్టాఫ్ ఇండియా టీమ్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఇషాన్ కిషన్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), మానవ్ సుతార్, సారాన్ష్ జైన్, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ, ముకేష్ కుమార్, యశ్ దయాల్, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చహర్.