IND vs AUS: బాగా ఆడితే ఇంటికి పంపించేశారు: ఆస్ట్రేలియా టూర్‌లో ఆ ఇద్దరు కుర్రాళ్లకు నిరాశ

ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. బ్యాకప్ ఓపెనర్ గా స్క్వాడ్ లో చోటు దక్కించుకుంటాడనుకుంటే నిరాశే మిగిలింది. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ కు సెలక్టర్లు చోటు కల్పించారు. ఇదిలా ఉంటే ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లో భారత్ 'ఎ'కి గైక్వాడ్ కెప్టెన్సీ చేశాడు. 

ఈ టెస్ట్ మ్యాచ్ లో గైక్వాడ్ తన కెప్టెన్సీ పాటు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ హాఫ్ సెంచరీ చేశాడు. వీటిలో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. గైక్వాడ్ సూపర్ ఫామ్ లో ఉండగానే అదే సమయంలో టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ వేలికి గాయమైంది. దీంతో అతను తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో గైక్వాడ్ కు ఛాన్స్ ఇస్తారేమో అనుకున్నారు. అయితే కర్ణాటక బ్యాటర్ పడిక్కల్ ను గిల్ ప్లేస్ లో ఎంపిక చేశారు. మరోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న గైక్వాడ్ ను స్వదేశానికి పంపించేశారు.

Also Read : ఇది మాత్రం ఊహించనిది

గిల్ తో పాటు సాయి సుదర్శన్ ను భారత్ కు పంపించేశారు. ఆస్ట్రేలియా ఏ తో జరిగిన తొలి మ్యాచ్ లో సాయి సుదర్శన్ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సహచరులు విఫలమైనా సాయి సుదర్శన్ చక్కని ఆట తీరును కనబరిచాడు. దీంతో ఈ తమిళ నాడు బ్యాటర్ కు ఏమైనా అవకాశం దక్కుతుందో అని వేచి చేసిన వాళ్ళకి నిరాశే మిగిలింది. ఇద్దరు భారత్ లో రంజీ ట్రోఫీ ఆడే అవకాశముంది.   ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభమవుతుంది.