రెండు సంవత్సరాల పాటు కరోనా వైరస్ ను అరికట్టేలా ఇమ్యనిటీ పవర్ అందిస్తున్నట్లు రష్యన్ కరోనా వ్యాక్సిన్ సుపుత్నిక్ వీ తెలిపింది. ఫైజర్ తో పాటు బైయోన్ టెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 4 నుంచి 5నెలల పాటు ఇమ్యూనిటీని అందిస్తుంది. గమలేయా రీసెర్చ్ స్పుత్నిక్ వీ పనితీరు పై స్పందించింది. రష్యా గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్ట్ అలెగ్జాండర్ మీడియాతో మాట్లాడుతూ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 2సంవత్సరాల పాటు ఇమ్యూనిటీని అందిస్తుందని, తాము ఎబోలా వైరస్ ను ఎలా తయారు చేశామో అదే తరహాలో కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేసినట్లు వెల్లడించారు.
ఈ వ్యాక్సిన్ సుమారు 2ఏళ్ల పాటు ఇమ్యూనిటీ పవర్ అందిస్తున్నట్లు తమ పరిశోదనల్లో తేలిందన్నారు. అదే సమయంలో అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ పై అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫైజర్ ఎన్ని నెలల పాటు ఇమ్యూనిటీ పవర్ అందిస్తుందనే విషయం చెప్పడం కష్టం. కానీ ఒకటి మాత్రం నిజం ఫైజర్ ఎక్స్ పెరిమెంటల్ డేటా ఆధారంగా 4 లేదా 5నెలల పాటు మాత్రమే కరోనా వ్యాక్సిన్ తో ఫైట్ చేసే ఇమ్యూనిటీ మన శరీరలో నిల్వ ఉంటుందని రష్యా గమాలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్ట్ అలెగ్జాండర్ స్పష్టం చేశారు.
