భారతీయులకు రష్యా వీసా ఫ్రీ ఎంట్రీ

భారతీయులకు 2025 నుంచి వీసా ఫ్రీ ఎంట్రీని రష్యా ప్రభుత్వం అధికారికంగా  ప్రకటించింది. రష్యా ప్రకటించిన వీసా రహిత ప్రవేశ దేశాల జాబితాలో భారత్​తోపాటు 62 దేశాలు ఉన్నాయి. కేవలం పాస్​పోర్ట్​, ఇతర గుర్తింపు పత్రాలతో రష్యాకు చేరుకునేవాళ్లు అక్కడి ఎయిర్​పోర్టులో వీసా ఫ్రీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవాలి. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ముందటి కంటే మెరుగ్గా, పటిష్టం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ మధ్య జరిగిన చర్చల ఫలితమే ఇది. 

    

  • భారతీయులు ఎక్కువగా వ్యాపారం, పర్యటన కోసం రష్యాకు వెళ్తుంటారు. 2023, ఆగస్టు నుంచి రష్యా వెళ్లేందుకు భారతీయులకు ఈ–వీసా వెసులుబాటు ఉన్నది. 2023లో రికార్డు స్థాయిలో 60,000 మంది భారతీయులు మాస్కోను సందర్శించారు. ఇది 2022 కంటే 26 శాతం ఎక్కువ. 
  •  రష్యాకు ఎక్కువ మంది ప్రయాణించే నాన్ సీఐఎస్​(కామన్​వెల్త్​ ఆఫ్​ ఇండిపెండెంట్స్​ స్టేట్స్​) దేశాల్లో భారత్​ మూడో స్థానంలో ఉన్నది. 2024 మొదటి త్రైమాసికంలోనే భారతీయులకు దాదాపు 1700 ఈ–వీసాలు జారీ అయ్యాయి.