ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ

ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ

డాలర్ తో పోలిస్తే  రూపాయి మారకం విలువ గత కొంత కాలంగా క్షీణిస్తోంది. తాజాగా ఆ విలువ ఏకంగా రూ.80కి చేరువయ్యింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.90 పైసల వద్ద ఉంది. ఉక్రెయిన్ యుద్దం మొదలైనప్పటి నుంచి అంటే.. గత ఆరు నెలల్లో రూపాయి విలువ 27 సార్లు పతనమైంది. ముందు నుంచీ ఈ విలువ రూ.80కి పడిపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ ఇవాళ రూపాయి మారకం విలువ రూ.79.72 పైసల వద్ద ప్రారంభమై రూ.79.92కు పడిపోయింది. ఫైనల్ గా ఆ విలువ రూ.79.90 పైసల వద్ద ముగిసింది. మొన్నటివరకూ రూ.74కు కాస్త అటూ ఇటుగా దోబూచులాడిన రూపాయి మారక విలువ.. ప్రస్తుతం రూ.80కి చేరువకు వచ్చింది. అంటే సుమారు 9శాతం పడిపోయింది.