Good Health : రన్నింగ్, జాగింగ్ వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది

వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం చాలామందికి తెలిసిందే. మానసికంగా, శారీ రకంగా దృఢంగా ఉంచుతుంది. వ్యాయామం. అంతేకాదు.. రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెబుతున్నారు. 

రన్నింగ్, జాగింగ్ చేయడం వల్ల ఆలోచనా శక్తి మెరుగుపడుతుందట. వ్యాయామం చేయనివాళ్లు, చేసినవాళ్ల అభిప్రా యాలను తీసుకొని వైద్యులు ఈ మాట చెప్పారు. వ్యాయామం చేసి నవాళ్లు చురుగ్గా ఉండటంతోపాటు వారి ఆలోచన తీరు బాగుందట. చేయనివాళ్లలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని చెప్పారు. రెగ్యు లర్ గా వ్యాయామం చేయడం వల్ల మతిమరుపు తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టవు.

మెదడు పనితీరు బాగుంటుంది. కేవలం ఆలోచన శక్తి పెరగడమే కాదు... నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది వ్యాయామం. ప్రశాంతమైన జీవనంతోపాటు ఆయుష్షును పెంచుతోంది వ్యాయామం.