బార్​ అండ్​ రెస్టారెంట్ ముసుగులో పబ్​ నిర్వహణ

జీడిమెట్ల, వెలుగు: బార్​ అండ్​ రెస్టారెంట్ ముసుగులో బాచుపల్లిలో కొనసాగుతున్న పెగ్​బ్రో పబ్​పై శుక్రవారం రాత్రి పోలీసులు రైడ్​చేశారు. డీజే సౌండ్ల మధ్య యువతీయువకులు ఎంజాయ్​  చేస్తున్నట్లు గుర్తించారు. డీజే సిస్టమ్​ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు సూర్యం, రఘుపతి, రవికుమార్​ అరెస్ట్ చేశారు.