భూ సేకరణకు రైతులు సహకరించాలి : ఆర్డీవో రాంమూర్తి

 కోహెడ, వెలుగు: గౌరవెల్లి  ప్రాజెక్టు నుంచి వచ్చే కెనాల్​ కోసం భూ సేకరణకు రైతులు సహకరించాలని ఆర్డీవో రాంమూర్తి కోరారు. సోమవారం కోహెడ జీపీలో ముంపునకు గురవుతున్న రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. కాలువ నిర్మాణానికి 14 కిలోమీటర్ల పొడవుతో 48 ఎకరాల 16 గుంటల భూమి అవసరం ఉందన్నారు. ఇందులో బావులు, బోర్లు, చెట్లకు ప్రత్యేక పరిహారం అందిస్తామన్నారు.

ప్రాజెక్టు ముంపు బాధితులకు ఎలాగైతే పరిహారం అందించామో అలాగే కెనాల్​లో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ విలువకు మూడింతలు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. రికార్డులో ఒకరు, కాస్తులో మరొకరు ఉన్నారని, అసలైన రైతులకే న్యాయం చేయాలని రైతులు ఆర్డీవోను కోరారు. కార్యక్రమంలో ఏసీపీ సతీశ్, ఇరిగేషన్​ఈఈ రమేశ్, డీఈ రేష్మ, తహసీల్దార్​ సురేఖ, ఎంపీవో శోభ, నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధర్మయ్య, జగన్​రెడ్డి, తిరుపతిరెడ్డి, బాలకిషన్, వెంకటస్వామి, మల్లారెడ్డి పాల్గొన్నారు.