ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో మంటలు..

సిద్దిపేట జిల్లాలో డ్రైవర్ అప్రమత్తతో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు  కుకునూరుపల్లి మండలం మేదినీపూర్ గ్రామ చౌరస్తా దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఇంజిన్ లో  మంటలు వచ్చాయి.  వెంటనే స్పందించిన డ్రైవర్ బస్సును పక్కకు ఆపారు. అందులోని ప్రయాణికులను కిందకు దించాడు. 

ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేశారు.  బస్సులో పదిమంది ప్రయాణికులు ఉన్నారు.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read :- శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే ఎవర్నీ వదలం