సంగారెడ్డిలో బ్రిడ్జిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్ పల్లి నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు  హైవే బ్రిడ్జ్ ను ఢీకొట్టింది.  ప్రమాద సమయంలో  బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా..  దాదాపు 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

ఘటనా స్థలానికి వచ్చిన  పోలీసులు గాయాలైన వారిని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు. ఈ మధ్య ఓవర్ స్పీడ్..  ఆర్టీసీ  డ్రైవర్ల నిర్లక్షం వల్ల తరచూ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి.