నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ కు 5 అదనపు తరగతులు, ఒక టాయిలెట్ నిర్మాణానికి గతేడాది 'మన ఊరు , మన బడి' కింద రూ.85 లక్షలు మంజూరయ్యాయి. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకున్నాడు. కానీ ఇప్పటి వరకు క్లాస్ రూమ్స్నిర్మించలేదు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు సెకండ్ క్లాస్ రూమ్ ఉరవడంతో టీచర్లు స్టూడెంట్స్ ను థర్డ్ క్లాస్ ముందు ఉన్న వరండాలో కూర్చో బెట్టి పాఠాలు చెబుతున్నారు.
ముసురు వర్షానికి తోడు చల్లటి గాలులు వీస్తుండడంతో స్టూడెంట్స్ వణికిపోతున్నారు. అలాగే కిచెన్ షెడ్ సరిగ్గా లేకపోవడంతో మిడ్ డే మీల్ నిర్వాహకులు వర్షంలోనే వంట చేస్తున్నారు. వారం రోజుల నుంచి వర్షం పడుతుండడంతో తీవ్ర ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -