లాల్​కోట చౌరస్తా వద్ద .. రూ.8.40 లక్షల నగదు సీజ్

మరికల్, వెలుగు: మండలంలోని లాల్​కోట చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్​ వద్ద వాహనాల తనిఖీలో రూ.8.40 లక్షలు పట్టుకున్నట్లు సీఐ రాజేందర్​రెడ్డి తెలిపారు. చెక్​పోస్ట్​ వద్ద వెహికల్స్​ చెక్​ చేస్తుండగా, దేవరకద్ర మండలం గూరకొండ గ్రామానికి చెందిన కింగూరి బీరప్ప తన కారులో రూ.8.40 లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. ఆధారాలు చూపించకపోవడంతో డబ్బు సీజ్​ చేసి గ్రీవెన్స్​ కమిటీకి అప్పగించినట్లు చెప్పారు.

హన్వాడ: ఎన్నికల కోడ్  నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.95వేల నగదును సీజ్  చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్​ తెలిపారు. గుండుమాల్  మండలం గోదారం గ్రామానికి చెందిన జనపాల ఆంజనేయలు నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తూ పట్టుబడినట్లు చెప్పారు.