స్పోర్ట్స్‌ అండ్‌ యూత్‌కు రూ.69.52 కోట్లు

హైదరాబాద్, వెలుగు: క్రీడలు, యువజన సర్వీసుల విభాగానికి కిందటేడాది కంటే నిధులు తగ్గాయి. ఈసారి రూ.69.52 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దీంట్లో నిర్వహణ పద్దు కింద రూ.63.48కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.6.03 కోట్లను కేటాయించారు. అయితే గతేడాది ఈ విభాగానికి రూ.112.63 కోట్ల నిధులు కేటాయించారు. గతేడాది ప్రగతి పద్దు కింద రూ.52.21 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి కేవలం రూ.6.03 కోట్లు కేటాయించడంతో క్రీడాభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే ప్రత్యేకంగా క్రీడలకు గతేడాది ప్రగతి పద్దు కింద రూ.4 కోట్లు కేటాయిస్తే, ఈసారి కేవలం రూ.1.20కోట్లు మాత్రమే కేటాయించారు.

Rs.69.52 crores to sports and youth in state Budget