ఫార్ములా ఈ రేసింగ్ కేసులో 600 కోట్ల అగ్రిమెంట్.. కేటీఆర్ ఆదేశాల మేరకే..

ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసిన డబ్బుకు సంబంధించి ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిధుల మళ్లింపుపై కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక హెచ్‌‌‌‌ఎండీఏ, మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ అంతర్గత విచారణ జరిపారు. గతంలో జరిగిన అగ్రిమెంట్స్‌‌‌‌ను పరిశీలించారు.

ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కి నోటీసులు జారీ చేశారు. 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 30న చేసుకున్న అగ్రిమెంట్ కుట్రపూరితమని తేల్చారు. ఫార్ములా ఈ– కార్ రేస్‌‌‌‌ కోసం మూడేండ్లకు గాను మొత్తం రూ.600 కోట్లు అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆధారాలు సేకరించారు. అనధికారికంగా రూ.46 కోట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కు 
చెల్లించినట్లు గుర్తించారు.

కేటీఆర్ ఆదేశాల మేరకే:

హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని సీఎస్‌‌‌‌ శాంతికుమారి జనవరి 6న ఐఏఎస్‌‌‌‌ అధికారి అర్వింద్​ కుమార్‌‌‌‌‌‌‌‌కు మెమో జారీ చేసింది. దీనికి వివరణ ఇస్తూ జనవరి 24న ఆయన సీఎస్‌‌‌‌కు ఎక్స్‌‌‌‌ప్లనేషన్ లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌, ఎక్స్‌‌‌‌ నెక్ట్స్‌‌‌‌ జెన్‌‌‌‌ సహా ఎంఏయూడీ ఒప్పందాలు, డబ్బులు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసిన వివరాలను వెల్లడించారు. అప్పటి మున్సిపల్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్​ ఆదేశాల మేరకే హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కు చెల్లించినట్లు వివరించారు.

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 18న ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ.. అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించింది. కేటీఆర్​ చుట్టే ఈ వ్యవహారం నడవడం.. ఆయన ఎమ్మెల్యే కావడంతో..  ఆయనను విచారించేందుకు గవర్నర్​ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్​ ప్రాసిక్యూషన్​కు అనుమతివ్వాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్​కు లెటర్​ రాయగా.. ఇటీవలే అనుమతి లేఖను సీఎస్‌‌‌‌కు గవర్నర్​  పంపారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మంగళవారం సీఎస్‌‌‌‌ నుంచి ఏసీబీకి ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగానే దాన కిశోర్‌‌‌‌‌‌‌‌ బుధవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు.