ఏలూరు అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

ఏలూరు అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

ఏలూరు పోరస్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని సీఎం ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. 

బుధవారం అర్థరాత్రి  ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్  కెమికల్  ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని జరిగింది.  యూనిట్ 4లో  రియాక్టర్ పేలడంతో  ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన 13 మందిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు మృతి