Small Business:ఉదయం 6 నుంచి 9 గంటల వరకు..5 వేల పెట్టుబడితో చేసే వ్యాపారం ఐడియా..!

ఇటీవల కాలంలో అందరికీ హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయింది. రోజూ ఉదయాన్నే వ్యాయామం, యోగా చేస్తున్నారు. హార్డ్ వర్క్ తో పాటు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన డ్రింక్స్, ఆహారం తీసుకుంటున్నారు. ప్రత్యేకించి చాలామంది ఉదయాన్నే మొలకలు తింటున్నారు. మొలకలు మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో లబ్ది చేకూరుస్తాయి. డాక్టర్లు కూడా ఈ మొలకలను ప్రిఫర్ చేస్తున్నారు. 

ఈ సమయంలో చిన్న బిజినెస్ స్టార్ చేయాలనుకునే వారికి మొలకల బిజినెస్ ఓ మంచి మార్గంగా చెప్పవచ్చు. చిన్న స్టాల్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కడైననా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పార్కుల, యోగా సెంటర్లు, ఫిట్ నెస్ సెంటర్ల వద్ద ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఉదయాన్ని జనం ఎక్కువగా తిరిగే మార్కెట్లు, షాపుల ముందు కూడా నిర్వహించుకోవచ్చు. రోజుకు కనీసం 2వేలు సంపాదించే అవకాశం ఉంది.   

ALSO READ | రోజుకి 1.35 కోట్ల ఫ్రాడ్‌‌ కాల్స్‌‌.. బ్లాక్‌‌ చేసి రూ.2,500 కోట్ల కాపాడాం

రోజుకు మూడు గంటల సమయం కేటాయించడం ద్వారా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఉదయం 6 గంటలనుంచి 9 గంటల వరకు మంచి టైం. షాపులు కూడా ఈటైంలో మూసి ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మీ బిజినెస్ చేసుకోవచ్చు. 

ఒక ప్లేట్ మొలకలు రూ. 20 చొప్పున రోజుకు 100 అమ్మినట్లయితే మీరు రోజుకు రూ. 2వేలుసంపాదించొచ్చు.  అంటే నెలకురూ. 60వేలు సంపాదించొచ్చు. మీ సంపాదన లో 40 శాతం పెట్టుబడిగా తీసేసినా.. 36 వేలు మిగులుతుంది. ఆలస్యం ఎందుకు ఇప్పుడే ప్రారంభించండి. 


సేకరణ:సోషల్ మీడియా నుంచి..ఈ కథనం నుంచి వ్యాపారం చేయటం అనేది మీ వ్యక్తిగతం. దీంతో వీ6 వెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.