రూ.2  వేల కోట్ల కుంభకోణం బట్టబయలు

రూ.2  వేల కోట్ల కుంభకోణం బట్టబయలు

న్యూఢిల్లీ: జీఎస్టీ రీఫండ్స్ పేరుతో కొందరు వ్యాపారులు భారీ కుంభకోణానికి పాల్పడ్డట్టు ఆఫీసర్లు గుర్తించారు. దాదాపు 1,377 మంది ఎగుమతిదారులు అక్రమంగా రూ.1,875 కోట్ల విలువైన జీఎస్టీ రీఫండ్లను తీసుకున్నట్టు తేలింది. వీటిలో పెద్దస్థాయి కంపెనీల పాత్ర కూడా ఉందని సమాచారం. ఇలాంటివే రూ.28.9 కోట్ల రీఫండ్ తీసుకున్నట్టు తెలిసింది. అయితే కచ్చితమైన వివరాలు ప్రస్తుతానికి తెలియవని సంబంధిత ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్రాల మధ్య జరిగే వస్తువులు, సేవలకు ఐజీఎస్టీ విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తం మొదట కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. 2017 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది.