జైపూర్: రాజస్థాన్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31 కోట్ల క్యాష్, కిలో బంగారు బిస్కెట్లు దొరికాయి. అందులో రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఆర్బీఐ రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన కాసేపటికే ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ ఉషా శర్మ, డీజీపీ ఉమేశ్ మిశ్రా, అడిషనల్ డీజీపీ, జైపూర్ కమిషనర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐటీ శాఖకు చెందిన యోజన భవన్లో తాళం వేసి ఉన్న ఓ అల్మరాలో ట్రాలీ సూట్‌కేస్‌లో పెద్ద ఎత్తున క్యాష్, గోల్డ్ బిస్కెట్లు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు స్పాట్‌కు వెళ్లి పరిశీలించగా.. రూ.2.31 కోట్ల క్యాష్, కిలో గోల్డ్ బిస్కెట్లుఉన్నట్టు తేలిందని కమిషనర్ శ్రీవాస్తవ తెలిపారు.
