iPhone 15: ఐఫోన్ 15పై 12వేల డిస్కౌంట్.. అతి తక్కువ ధర.. త్వరపడండి..!

మీకుఐఫోన్ అంటే ఇష్టమా..! ఆపిల్ ఫోన్ వాడాలన్నదే మీ కోరికా..! ఆ కోరిక తీర్చుకునే సదవకాశం మీ ముందుకొచ్చింది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.. ఐఫోన్ 15పై రూ. 12వేల భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో, అతి తక్కువ ధరకు ఐఫోన్ చేజిక్కించుకునే అవకాశమొచ్చింది.

వాస్తవ ధరపై రూ. 8వేల తగ్గింపు 

ప్రస్తుతం ఆన్‍లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్లలో ఐఫోన్ 15(128GB వేరియంట్) ధర రూ. 79,600గా ఉంది. ఇది వాస్తవ ధర. దీనిపై అమెజాన్‌లో రూ. 8,310 ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది. తద్వారా మొబైల్ రూ. 71,290 ధరకు అందుబాటులో ఉంది. దీనికి బ్యాంకు ఆఫర్ కలుపుకుంటే మరో రూ. 4,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. అందుకోసం SBI లేదా ICICI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలి. దాంతో, ఐఫోన్ 15ని 67,290 రూపాయల తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించని వారంటూ ఎవరూ ఉండరు. ముందుగా 67వేల మొత్తాన్ని సరిచూసుకొని.. కార్డు ఉన్న వారిని సంప్రదిస్తే మీ పని సులభం. వచ్చే నెలలో iPhone 16 సిరీస్ లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రకటించారు.

ఫ్లిప్ కార్ట్‌లో రూ.66,249

మరో ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్‌లో బ్యాంకు ఆఫర్‌తో కలుపుకుంటే..  ఐఫోన్ 15ని 66,249 రూపాయల తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.  

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్స్

  • 6.1-ఇంచెస్ XDR OLED డిస్‌ప్లే
  • iOS 17 వర్షన్
  • A16 బయోనిక్ చిప్‌సెట్
  • బ్యాక్ కెమెరా 48MP + 12MP
  • ఫ్రంట్ కెమెరా 12MP
  • బ్యాటరీ సామర్థ్యం 3349mAh(15W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్)