వచ్చే ఆరు నెలల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెరుగుతున్నట్లు ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ప్రకటించారు.
తక్కువ ధర ప్లాన్లతో టెలికాం సంస్థలు నెట్టుకురావడం కష్టమేనన్న ఆయన.. 16 జిబి డేటాను ₹ 160 ధర కు ఇవ్వడం విషాదంగా మిట్టల్ ప్రస్తావించారు.
మీరు నెలకు రూ.160 కి 1.6 జీబీ సామర్థ్యాన్ని వినియోగిస్తారో లేదా మీరు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధం అవుతారో ఎంచుకోవల్సిన సమయ ఆసన్నమైందన్నారు. యూఎస్ , యూరప్ దేశాల తరహాలో 50-60 డాలర్లు ధరలు కోరుకోవడం లేదన్నారు. కాని ఖచ్చితంగా నెలకు 16 జిబికి 2 డాలర్లు ధర అంటే టెలికాం సంస్థలు నెట్టుకు రావడ కష్టమనే భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా మిట్టల్ చెప్పారు.
టెలికాం సంస్థలకు వచ్చే ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (arpu) ప్రకారం డిజిటల్ కంటెంట్ వినియోగంపై పెరిగింది కాబట్టి రాబోయే ఆరు నెలల్లో ఎయిర్‌టెల్ రూ .200 దాటాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
జూన్ 30, 2020 న ముగిసిన మొదటి త్రైమాసికంలో ఎయిర్‌టెల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ లో 157 రూపాయలకు పెరిగినట్లు నివేదించింది. 2019 డిసెంబర్‌లో ఎయిర్‌టెల్ టాక్ టైం ధరల్ని పెంచడంతో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరిగినట్లు తెలుస్తోంది.
యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ లో(arpu) ₹ 300 పెరగాలని భావిస్తున్నట్లు చెప్పిన మిట్టల్..ప్రస్తుతం నెలకి రూ.100కే ఎక్కువ డేటాతో సినిమాలు, వినోదాన్ని పొందుతుందన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కాస్త ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుందన్నారు.
రాబోయే ఆరు నెలల కాలంలో రూ .200 మార్కును దాటాలి మరియు 250 రూపాయలు ఇంకా అనువైనవన్నారు.టెలికాం లేని వ్యాపారాలు డిజిటల్ వైపు చూడాలన్నారు. దానికి ఇంకా సమయం పడుతుందని ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ప్రకటించారు.
