కర్నూలు: కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.కోటి నగదును పోలీసులు పట్టుకున్నారు. నంద్యాల ప్రాంతంలో కరోనా లాక్ డౌన్ విధించడంతో కర్నూలు జిల్లా పాణ్యం వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నుండి వస్తున్న కారును అనుమానంతో తనిఖీ చేయగా.. సుమారు రూ.కోటి నగదు ఉన్నట్లు గుర్తించారు. డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విట్ఠల్ ను విచారించగా హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు హాస్పిటల్ కు ఈ డబ్బును తరలిస్తున్నట్లు చెబుతున్నారని పాణ్యం CI జీవన్ గంగానాధ్ బాబు తెలిపారు. ఆధారాల కోసం వివరాలు అడిగితే చూపకపోవడంతో అక్రమం నగదుగా గుర్తించి సీజ్ చేశారు . కారు డ్రైవర్ తోపాటు.. నగదు తరలిస్తున్న దత్తాత్రేయ విట్టల్ ను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్నట్లు చెబుతున్న ఈ కారు(నెంబర్: TS 12 EF 9003) ను పోలీసులు సీజ్ చేశారు.


