పేదల బండి అన్ని వర్గాలను ఆదరిస్తుంది. అందుకే కుల మతాలకు తావు లేకుండా అందరినీ వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. అంతేకాదు ప్రయాణ సమయంలో ఎవరికైనా సమస్య ఉందని తెలిస్తే తమ వంతు సాయం చేస్తుంది. అందుకే ఇండియన్ రైల్వే మనదేశంలో అందరి మనన్నలు పొందుతుంది. తాజాగా హౌరా-రాంచీ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న షానవాజ్ అక్తర్ కు ఇఫ్తార్ విందు ఇచ్చారు రైల్వే అధికారులు. రంజాన్ ఉపవాసాన్ని విరమించబోతుండగా అతనికి ఇఫ్తార్ అందించడంపై ఆశ్వర్యం వ్యక్తం చేశారు. అక్తర్ ధనబాద్ లో శతాబ్ది రైలు ఎక్కినప్పుడు ఉపవాసం విరమించే సమయంలో ఆలస్యంగా టీ తీసుకురమ్మని ప్యాంట్రీ సిబ్బందికి చెప్పాడు. అతను అక్తర్ ను మీరు రోజా ఉన్నారా అని అడిగాడు. అందుకు అవునని తల ఊపుతూ సమాధానం చెప్పాడు అక్తర్. కొద్దిసేపటికి మరొకరు ఇఫ్తార్ తో వచ్చారు. అది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని అక్తర్ చెప్పాడు. తనపై చూపిన ప్రేమకు ఇండియన్ రైల్వేకు ధన్యవాదాలు తెలిపారు. అక్తర్ కు భోజనాన్ని క్యాటరింగ్ సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని రైల్వే అధికారులు తెలిపారు.రైల్వే సిబ్బంది నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ విషయాన్ని షానవాజ్ అక్తర్ తన భోజనం ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
మరిన్ని వార్తల కోసం
వీ6–వెలుగు పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు
టీఆర్ఎస్తో ప్రశాంత్ కిశోర్ దోస్తీ
Thank you #IndianRailways for the #Iftar
— Shahnawaz Akhtar شاہنواز اختر शाहनवाज़ अख़्तर (@ScribeShah) April 25, 2022
As soon as I boarded Howrah #Shatabdi at Dhanbad,I got my snacks.I requested the pantry man to bring tea little late as I am fasting.He confirmed by asking, aap roza hai? I nodded in yes. Later someone else came with iftar❤@RailMinIndia pic.twitter.com/yvtbQo57Yb
మరిన్ని వార్తల కోసం
శతాబ్ది రైలులో అక్తర్ కు ఇఫ్తార్ విందు
