IPL 2025: కింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. RCB కెప్టెన్‌గా కోహ్లీ..?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అందనుంది. ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. పలు నివేదికలు కోహ్లీ 2025 ఐపీఎల్ బెంగళూరు సారధ్య బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు తెలుపుతున్నాయి. అదే జరిగితే 4 ఏళ్ళ తర్వాత విరాట్ ను మళ్ళీ కెప్టెన్ గా చూడవచ్చు. 2021లో కోహ్లీ బెంగళూరు జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దీంతో అప్పట్లో అనుభవజ్ఞుడైన సౌతాఫ్రికా ప్లేయర్ ఆర్సీబీ జట్టును నడిపిస్తూ వచ్చాడు. 

ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్ గా జట్టుకు విజయాలు అందించి ప్లే ఆఫ్ వరకు తీసుకెళ్లినా ట్రోఫీ అందించడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025మెగా ఆక్షన్ జరగనుండడంతో డుప్లెసిస్ ను కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సఫారీ ప్లేయర్ ను రిటైన్ చేసుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. వస్తున్న నివేదికల ప్రకారం డుప్లెసిస్ తో పాటు ఫారెన్ ప్లేయర్లలందరిని బెంగళూరు జట్టు వదిలేసుకున్నట్టు సమాచారం. దీంతో కోహ్లీని కెప్టెన్ గా ఉండమని ఆర్సీబీ యాజమాన్యం కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 31 నాటికి రిటెన్షన్ జాబితాను షార్ట్‌లిస్ట్ చేయాలి.

Also Read :- రేటింగ్‌‌, ర్యాంక్‌‌ను పట్టించుకోను

కోహ్లీ ఆర్సీబీ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్‌. 35 ఏళ్ల విరాట్.. 143 మ్యాచ్‌లలో  బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ చేశాడు. కోహ్లీ  నాయకత్వంలో ఆర్సీబీ 2016 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్ లో కోహ్లీ కెప్టెన్సీతో పాటు బ్యాటర్ గాను పలు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు సెంచరీలతో పాటు మొత్తం 973 పరుగులు చేసి ఒకే సీజన్ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. 

ఆర్సీబీ రిటైన్ ప్లేయర్ల విషయానికి వస్తే కోహ్లితో పాటు మహ్మద్ సిరాజ్ ముందు వరుసలో ఉన్నాడు. అన్‌క్యాప్డ్ కేటగిరీలో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్‌ను కొనసాగించే అవకాశం ఉంది. మెగా వేలంలో రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ద్వారా విల్ జాక్స్, రజత్ పటీదార్, ఆకాష్ దీప్ లను తీసుకోవాలని చూస్తున్నారు. మ్యాక్స్ వెల్, డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్ మెగా ఆక్షన్ లోకి రానున్నారు.