హిట్లర్, గడాఫీ కలిస్తే చంద్రబాబు... రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పర్వం నడుస్తోంది. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వరుస పెట్టి అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో  తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై స్పందించారు మాజీ మంత్రి రోజా. సీఎం చంద్రబాబును ఉద్దేశించి తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు రోజా. ఏపీలో హిట్లర్, గడాఫీ కలిసి పాలన చేస్తున్నట్లుగా పరిస్థితి ఉందని అన్నారు.

వైసీపీ నేతలపై మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రోజా . వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై, ఆయన భార్య భారతి, ఇతర వైసిపి నేతల పైన సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రోజా. తమ పార్టీ నేతలను, మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ALSO READ | నటుడు, వైసీపీ నేత పోసానిపై సీఐడీ కేసు..

వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్ అయిన ఐటీడీపీ నీచపు పోస్టులు పెట్టినప్పటికీ తాము ఇంత క్రూరంగా వ్యవహరించలేదని అన్నారు.  ఏ తప్పు చేయని వారిపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఏపీలో సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు రోజా.