Rohit Sharma: తండ్రి కాబోతున్న రోహిత్ శర్మ.. లీక్ చేసిన హర్ష భోగ్లే

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. రోహిత్ సతీమణి రితిక సజ్దే బేబీ బంప్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటికితోడు, భారత్ - న్యూజిలాండ్ ఆఖరి టెస్టు రెండో రోజు ఆటలో కామెంటేటర్ హర్ష భోగ్లే.. త్వరలో భారత కెప్టెన్ ఇంటికి అతిథి రాబోతున్నారని వ్యాఖ్యానించడంతో ఈ వార్తా దావానంలా వ్యాపిస్తోంది. 

ముంబై వాంఖడే వేదికగా జరుగుతోన్న భారత్ - న్యూజిలాండ్ ఆఖరి టెస్టు రెండవ రోజు ఆటకు హాజరైన రితిక.. అభిమానుల కంట పడకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. అభిమానులు ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు తీసి.. వాటిని నెట్టింట పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే.. కామెంటేటర్ హర్ష భోగ్లే లీకులివ్వడంతో వార్తలకు బలం చేకూరింది.       

"ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న రోహిత్ శర్మ గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. అతను మొదటి టెస్ట్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అతని కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు.." అని భోగ్లే వ్యాఖ్యానించారు. తండ్రి కాబోతున్నందునఆసీస్‌తో జరిగే తొలి టెస్టుకు  రోహిత్ దూరం కానున్నాడని సమాచారం. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌ వేదికగా జరిగే రెండో టెస్ట్ నాటికి హిట్‌మ్యాన్ జట్టులో చేరవచ్చని తెలుస్తోంది. 

కాగా రోహిత్ , రితికా సజ్దేల వివాహం డిసెంబర్ 13, 2015న జరగ్గా.. ఈ జంటకు ఓ కుమార్తె ఉంది. పేరు.. సమైరా.  2018, డిసెంబర్ 30న సమైరా జన్మించింది.