Rohit Sharma: వారసుడు వచ్చాడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ సతీమణి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రయ్యాడు. అతని సతీమణి రితికా సజ్దే శుక్రవారం(నవంబర్ 15) రాత్రి పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఈ దంపతులకు సమైరా అనే కుమార్తె ఉంది. ఈ విషయం తెలిసి అభిమానులు.. రోహిత్, రితికా జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

మొదటి రెండు టెస్టులకు దూరం

కంగారులతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ మినహా ఇతర ఆటగాళ్లు ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. రితికా సజ్దే డెలివరీ ఉండటంతో రోహిత్ మొదటి రెండు టెస్టుల నుంచి విరామం తీసుకున్నాడు. డెలివరీ సమయంలో ఆమె పక్కనే ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే డెలివరీ ముందుగానే జరిగింది కనుక రోహిత్ త్వరగా జట్టుతో కలవచ్చని సమాచారం.

ప్రేమ వివాహం

తన మేనేజరైన రితికా సజ్డేను రోహిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015 డిసెంబరు 13న వీరి వివాహం జరగ్గా.. 2018 డిసెంబర్ 30న సమైరా జన్మించింది. ఇప్పుడు రెండో సంతానం వారింటికి చేరారు.