ఆస్ట్రేలియాతో బోర్డర్ –గావస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుకు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఆడతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి ప్రాక్టీస్ ప్రారంభించేశారు. రోహిత్ మాత్రం ఆస్ట్రేలియా వెళ్లలేదని తేలిపోయింది. హిట్ మ్యాన్ ప్రస్తుతం ముంబైలోనే ఉన్నాడు. అతను ముంబై గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పెర్త్ టెస్టుకు జట్టుతో కలిసి ప్రయాణించని రోహిత్ ముంబైలో కష్టపడుతున్నాడు. టీమిండియా కెప్టెన్ బుధవారం (నవంబర్ 13) రిలయన్స్ కార్పోరేట్ పార్క్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరో వారం రోజుల్లో టెస్ట్ ఉంచుకొని ఆస్ట్రేలియాకు వెళ్లని హిట్ మ్యాన్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో రోహిత్ ఇండియాలోనే ఉంటాడనే టాక్ వినిపిస్తుంది.
రోహిత్ మూడో వారంలో జట్టుతో కలుస్తాడని,ఈ నేపథ్యంలో తను తొలి టెస్టుకు దూరం అవుతాడని ఇప్పుడే ప్రకటించలేమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. రోహిత్ గురించి ఎలాంటి సమాచారం లేదని.. ఒకవేళ రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు దూరమైతే.. అతని గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తాడని హెడ్ కోచ్ గంభీర్ ఇప్పటికే తెలిపాడు.
న్యూజిలాండ్‌పై భారత్ 3-0తో వైట్‌వాష్ అయిన తర్వాత భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాల్సిన పరిస్థితి. రోహిత్ సేన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే, ఆస్ట్రేలియా పర్యటన చావో రేవో లాంటిది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 5-0 లేదా 4-0 తేడాతో సిరీస్ దక్కించుకుంటే, తప్ప ముందుకెళ్లే దారుల్లేవ్. అలాకాకుండా కంగారూల జట్టు ట్రోఫీని అందుకుంటే.. మనం ఆశలు వదులుకోవాల్సిందే.
? ROHIT SHARMA HAS STARTED TRAINING ?
— Johns. (@CricCrazyJohns) November 13, 2024
Rohit continues to train at Mumbai - He is expected to travel to Australia post the birth of the second child. [Sahil Malhotra from TOI] pic.twitter.com/82NPza8Hga