BGT 2024: ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు షమీ దూరం.. కన్ఫర్మ్ చేసిన రోహిత్ శర్మ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు దూరం ట్రోఫీకి దూరం కానున్నాడు. అతని గాయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. షమీ పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు  కష్టపడుతున్నాడని.. అతన్ని బలవంతంగా ఆడించడం తమకు ఇష్టం లేదని రోహిత్ తెలిపాడు. 

"షమీ మోకాళ్లలో వాపు ఉంది. అతను 100 శాతం ఫిట్ గా ఉండేందుకు సమయం ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో షమీని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లడం సరైన నిర్ణయం కాదని మేము భావిస్తున్నాం. ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ లేకుండా అత్యున్నత ప్రదర్శన చేయడం చాలా కష్టం. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ముందు షమీ రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాలి". అని హిట్ మ్యాన్ తెలిపాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తుంటే షమీ ఈ నవంబర్ లో జరగబోయే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నాడని తెలుస్తుంది. 

ALSO READ | IND vs NZ 2024: రేపే టీమిండియాతో తొలి టెస్ట్.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఔట్

షమీ వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో కనిపించలేదు. గాయం కారణంగా దాదాపు 10 నెలలపాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు.  న్యూజిలాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ అందుబాటులో లేడు. రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీకి చోటు దక్కలేదు. టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కీలకమైన ఈ ట్రోఫీకి అనుభవజ్ఞుడు షమీ దూరమైతే భారమంతా సిరాజ్, బుమ్రాపై పడనుంది. భారత్ కు నాణ్యమైన మూడో పేసర్ లేడు. 

గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురయ్యాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు.

సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.