న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ ను క్లీన్‌స్వీ ప్చేసిన జోరుమీదున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాలి పిక్క గాయంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. వన్డే, టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో వన్డేలకు మయాంక్ అగర్వాల్ , టెస్ట్‌లకు శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేయనున్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఈ రెండు ప్రత్యామ్నాయాలను గుర్తించినా .. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. న్యూజిలాండ్ వెళ్తున్న బీసీసీఐ సెక్రటరీ జైషా అక్కడికి చేరాక దీనిపై స్పష్టత వచ్చేచాన్స్ ఉంది. ఇప్పటికే ఈ ఇద్దరి పేర్లను సెక్రటరీకి పంపినట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయి టెస్ట్ జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉన్నా.. ఎంపిక మాత్రం పూర్తయినట్లు సమాచారం. ‘రోహిత్ మిగతా టూర్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి అంత బాగా లేదు. గాయం తీవ్రతను ఫిజియో అంచనా వేస్తున్నాడు. ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసుకుంటాం. ఏదేమైనా ముంబైకర్ సిరీస్ లోఆడే చాన్స్ అయితే లేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బుధవారం నుంచి కివీస్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ మొదలు కానుంది. తర్వాత రెండు టెస్ట్‌ల సిరీస్ జరుగుతుంది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

