రోహిత్ భాయ్‌‌.. పదేండ్లు అయిందబ్బా.. హిట్‌‌మ్యాన్ ఆటోగ్రాఫ్ కోసం పదేండ్లు ఎదురుచూసిన అభిమాని

కాన్‌‌బెర్రా: తన ఆటోగ్రాఫ్​ కోసం ఏకంగా పదేండ్లుగా ప్రయతిస్తున్న అభిమాని కోరికను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు తీర్చాడు.  ఇండియా, ఆసీస్ పీఎం ఎలెవన్ మధ్య పింక్ బాల్ ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌ ముగిసిన తర్వాత రోహిత్ స్టాండ్స్‌‌లోని అభిమానుల జెర్సీలు, చిన్న బ్యాట్లపై ఆటోగ్రాఫ్‌‌ చేస్తూ కనిపించాడు. ఈ సమయంలో ఓ వ్యక్తి  ఆటోగ్రాఫ్ కోసం  రోహిత్‌‌ భాయ్‌‌.. ప్లీజ్.. ప్లీజ్‌‌ అని అరిచాడు.  

చివరకు ‘పదేండ్లు అవుతుందబ్బా’ అనగానే రోహిత్ నవ్వాడు. ఆ వెంటనే సదరు అభిమాని ‘ముంబై కా రాజా’ అనడంతో మరింత గట్టిగా నవ్విన హిట్‌‌మ్యాన్‌‌ తన దగ్గరకు వెళ్లి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌‌గా మారింది.