ఆసీస్‌‌‌‌తో ఓ టెస్ట్‌‌‌‌కు రోహిత్‌‌‌‌ డౌట్‌‌‌‌

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌‌‌‌ల్లో ఒక దానికి కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. వ్యక్తిగత కారణాలతో అతను ఓ మ్యాచ్‌‌‌‌కు దూరమవుతున్నాడని, ఈ మేరకు బీసీసీఐ కూడా ఈ విషయాన్ని తెలియజేశాడని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘నవంబర్‌‌‌‌ 22 నుంచి పెర్త్‌‌‌‌లో తొలి టెస్ట్‌‌‌‌, డిసెంబర్‌‌‌‌ 6 నుంచి అడిలైడ్‌‌‌‌లో రెండో మ్యాచ్‌‌‌‌ జరగనుంది. ఈ రెండింటిలో ఒకదానికి హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ అందుబాటులో ఉండడు. 

అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ సిరీస్‌‌‌‌కు ముందే వ్యక్తిగత సమస్యలు పరిష్కారమైతే అన్ని మ్యాచ్‌‌‌‌లు ఆడతాడు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై  క్లారిటీ వస్తుంది’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రోహిత్‌‌‌‌ అందుబాటులో లేకపోతే అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌ను టీమ్‌‌‌‌లోకి తీసుకోనున్నారు. 

యశస్వి జైస్వాల్‌‌‌‌తో కలిసి అభిమన్యు ఓపెనింగ్‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌ ఉంది. లేదంటే గిల్‌‌‌‌, రాహుల్‌‌‌‌లో ఒకరికి చాన్స్‌‌‌‌ దక్కొచ్చు. ఇక వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ విషయంలో రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.