BGT 2024-25: రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా బుమ్రా.. గంభీర్ బిగ్ హింట్

ఆస్ట్రేలియాతో  బోర్డర్ –గావస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుకు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఆడతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సిరీస్‌‌‌‌ కోసం ఆదివారం(నవంబర్ 10) తొలి బ్యాచ్ లో కొంతమంది ప్లేయర్లు ముంబై నుంచి ఆసీస్‌‌‌‌కు ప్రయాణం అయ్యారు. సోమవారం (నవంబర్ 11) రెండో బ్యాచ్‌‌‌‌ వెళ్లనుంది. తన భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో రోహిత్ టీమ్‌‌‌‌తో  కలిసి ఆసీస్‌‌‌‌కు వెళ్లడం లేదని తెలుస్తుంది. 

రోహిత్ మూడో వారంలో జట్టుతో కలుస్తాడని,ఈ నేపథ్యంలో తను తొలి టెస్టుకు దూరం అవుతాడని ఇప్పుడే ప్రకటించలేమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంపై గంభీర్ బిగ్ స్పందించాడు. " రోహిత్ పై ఇంకా ఎలాంటి నిర్ధారణ రాలేదని గంభీర్ తెలిపాడు. ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. " రోహిత్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అతను అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాను. ఒకవేళ రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు దూరమైతే.. అతని గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తాడు". అని తెలిపాడు. 
 
న్యూజిలాండ్‌పై భారత్ 3-0తో వైట్‌వాష్ అయిన తర్వాత భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాల్సిన పరిస్థితి. రోహిత్ సేన టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే, ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌ చావో రేవో లాంటిది. బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీని 5-0 లేదా 4-0 తేడాతో సిరీస్ ద‌క్కించుకుంటే, తప్ప ముందుకెళ్లే దారుల్లేవ్. అలాకాకుండా కంగారూల జట్టు ట్రోఫీని అందుకుంటే.. మనం ఆశ‌లు వదులుకోవాల్సిందే.