IND vs BAN 2024: గిల్ దవడపై కొట్టిన రోహిత్.. డగౌట్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంతే ఫన్నీగా ఉంటాడు. తాజాగా అతను డగౌట్ వద్ద సరదాగా చేసిన ఒక సంఘటన నవ్వు తెప్పిస్తోంది. చెన్నై టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా తొలి సెషన్ లో బ్యాటింగ్ చేస్తుంది. ఈ సమయంలో రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌తో సరదాగా గడిపాడు. ఈ క్రమంలో ఏదో చెబుతున్నట్టు చేయి చూపిస్తూ గిల్ దవడపై కొట్టాడు. దీంతో గిల్ చిన్నపిల్లాడిలా ఏడవడం ప్రారంభించాడు.

ఈ సీన్ చూసిన కోహ్లీ వారిద్దరి వైపు కెమెరా ఉందనే సంగతి గుర్తు చేశాడు. దీంతో రోహిత్ తో పాటు కోహ్లీ, గిల్, గంభీర్ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎంతో సరదాగా సాగిన ఈ సంఘటన ముచ్చట గొలిపేలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ, రోహిత్, గిల్ విఫలమయ్యారు. కోహ్లీ, రోహిత్ 6 పరుగులు చేయగా.. గిల్ డకౌటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ 5 పరుగులకు కోహ్లీ 17 పరుగులకు పెవిలియన్ చేరగా.. గిల్ మాత్రం 119 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  

ALSO READ : IND vs BAN 2024: విజయానికి 6 వికెట్ల దూరంలో: తొలి టెస్ట్‌లో గెలుపు దిశగా భారత్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. వెలుతురు లేని కారణంగా అరగంట ముందుగానే ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ శాంటో (51).. షకీబ్ (5) ఉన్నారు. భారత్ మరో 6 వికెట్లు తీస్తే గెలుస్తుంది. మరోవైపు బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే  357 పరుగులు చేయాల్సి ఉంది.