IND vs BAN 2nd Test: ఇదెక్కడి ట్విస్ట్.. రోహిత్, కోహ్లీలకు బంగ్లాదేశ్ క్రికెటర్ బ్యాట్ గిఫ్ట్

సాధారణంగా యంగ్ క్రికెటర్లకు స్టార్ ప్లేయర్లు బ్యాట్ ను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ మాత్రం టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బ్యాట్ ను బహుమతిగా ఇచ్చి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా ముగిసిన రెండో టెస్ట్ అనంతరం ఈ సంఘటన జరిగింది. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. 

మెహిదీ హసన్ మాజీ బంగ్లాదేశ్ క్రికెటర్ ఇమ్రుల్ కయేస్, కొంతమంది స్నేహితులతో కలిసి 'MKS స్పోర్ట్స్' అనే బ్యాట్ కంపెనీని గత సంవత్సరం ప్రారంభించాడు.  అక్టోబర్ 1న సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్‌కి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబర్ 1న సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్‌కి బహుమతి ఇవ్వాలని బంగ్లా స్పిన్నర్ నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే కోహ్లీ తన బ్యాట్ ను షకీబ్ కు గిఫ్ట్ గా ఇచ్చి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. దీంతో కోహ్లీకి కూడా బ్యాట్ ను ఇవ్వాలనున్నాడట. 

ALSO READ | Usman Qadir: 31 ఏళ్లకే వీడ్కోలు.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్ స్పిన్నర్ రిటైర్మెంట్

మిరాజ్ బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌ను కోహ్లీ తీసుకొని బెంగాలీ భాషలో మాట్లాడాడు. "ఖూబ్ భలో అచీ (ఇది చాలా బాగుంది)" అని కోహ్లి చిరునవ్వుతో మిరాజ్ కంపెనీ తయారు చేసిన బ్యాట్‌ను ప్రస్తావిస్తూ అన్నాడు. "మీకు శుభాకాంక్షలు. మంచి పని చేస్తూ ఉండండి.” అని చెప్పుకొచ్చాడు. మరోవైపు మెహదీ ఎప్పటి నుంచో రోహిత్ కు బ్యాట్ ఇవ్వాలని ఆరాటపడుతున్నాడట. తన కల నెరవేరిందని ఈ బంగ్లా  స్పిన్నర్ తెలిపాడు. 

బ్యాట్ తీసుకున్న రోహిత్ ఇలా స్పందించాడు "మెహిదీ నాకు చాలా కాలంగా తెలుసు. అతను చాలా మంచి క్రికెటర్. తన స్నేహితులతో కలిసి సొంతంగా బ్యాట్ కంపెనీని ప్రారంభించినందుకు నేను గర్విస్తున్నాను. నేను అతనికి అన్ని శుభాలు జరగాలని కోరుకుంటున్నాను. దేవుడు అతనికి విజయాన్ని ప్రసాదిస్తాడు. అతని సంస్థ అందరినీ మించిపోతుందని నేను ఆశిస్తున్నాను". అని హిట్ మ్యాన్ తన విషెస్ తెలియజేశాడు.