తీహార్ జైల్లో గ్యాంగ్ వార్.. గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియా హత్య

తీహార్ జైల్లో గ్యాంగ్ వార్..  గ్యాంగ్ స్టర్  టిల్లు తాజ్ పురియా హత్య

ఢిల్లీలోని తీహార్ జైల్లో గ్యాంగ్ వార్  జరిగింది. ఈ గ్యాంగ్ వార్ లో రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడు టిల్లు తాజ్ పురియాను  ప్రత్యర్థి యోగేష్  కొట్టి చంపాడు. తీవ్ర గాయాలైన తాజ్ పురియాను  ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

తీహార్ జైలులో  హై-సెక్యూరిటీ వార్డులోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న టిల్లు గదిలోకి ఇవాళ (మే2) ఉదయం  ఫస్ల్ ఫ్లోర్ లో ఉన్న  ప్రత్యర్థి గోగి గ్యాంగ్ (దీపక్, యోగేష్, రాజేష్ & రియాజ్ ఖాన్) సెక్యూరిటీ గ్రిల్ తెరిచి బెడ్‌షీట్‌ల సహాయంతో దూకారు.  టిల్లు తాజ్ పురియా అలియాస్ సునీల్ మాన్ ఉంటున్న గది గ్రిల్ ను తొలగించి  ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.  2021లో రోహిణి కోర్టు షూటౌట్ కేసులో తాజ్‌పురియా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

https://twitter.com/ANI/status/1653230731043414017