మంచుతో నిండిపోయిన రోడ్లు

మంచుతో నిండిపోయిన రోడ్లు

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. చమోలీ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న మంచు వల్ల ఉష్ణోగ్రత పడిపోయింది. రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. రోడ్లపై మంచు పడటంతో.. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. హిమాచల్ ప్రదేశ్ లోని చమోలీలోనూ.. రోడ్లపై మంచు పేరుకుపోయింది. క్రేన్ల సాయంతో మంచును తొలగించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.