మెదక్ జిల్లాలో అత్యంత భారీ వర్షం.. పలు చోట్ల రాకపోకలు బంద్..

తెలంగాణ వ్యాప్తంగా రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. జిల్లాలోని పాతూరులో 20 సెం. మీ అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షాలకు ఉదృతంగా వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో హావేలి ఘనపూర్ నుంచి వాడి గ్రామంతో పాటు పలు తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుబ్బాక నియోజకవర్గం లోని పలు మండలాల్లో గ్రామాలలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

కోహెడ మండలంలో  బస్వాపూర్ లో మోయ తుమ్మెద వాగు బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి.  సిద్దిపేట హనుమకొండకు రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని సమాచారం.హుస్నాబాద్ లో రేణుక ఎల్లమ్మ వాగులో పొంగటంతో రోడ్డుకు సమానంగా నీరు వచ్చి చేరింది.సిద్దిపేట హనుమకొండ మధ్య కూడా రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read :- బీభత్సం : మణుగూరుకు 30 ఏళ్లలో ఇంత వరదలు ఎప్పుడు రాలే