కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని రోడ్లు అధ్వానం..రాకపోకలు కష్టం

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని పలు పట్టణాలు, మండలకేంద్రాల్లోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. కరీంనగర్ సిటీలో మెయిన్ రోడ్లు, కొన్ని కాలనీల రోడ్లు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగానే ఉన్నప్పటికీ  విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు బురదమయంగా మారాయి. కరీంనగర్ సిటీలో కొన్ని చోట్ల అసంపూర్తిగా వదిలేసిన రోడ్లతో జనం ఇబ్బంది పడుతున్నారు. 

గతంలో వేసిన రోడ్లు కొన్ని చోట్ల కంకర తేలి, గుంతలు గ్రామాల్లోని మట్టి రోడ్లు వర్షాలతో బురదమయంగా మారి నడవలేని పరిస్థితి నెలకొంది.వాటిని ఎప్పటికప్పుడు రిపేర్ ​చేయకపోవడంతో గుంతలు ఏర్పడి రాకపోకలకు కష్టంగా మారుతోంది. గుంతల రోడ్లపై ప్రయాణం సర్కస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీట్లను తలపిస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

 - ఫొటోగ్రాఫర్, కరీంనగర్, వెలుగు/నెట్ వర్క్