ఇంజినీర్లను సస్పెండ్ చేసిన పంజాబ్ సర్కార్

ఇంజినీర్లను సస్పెండ్ చేసిన  పంజాబ్ సర్కార్

పంజాబ్ హోషియార్ పుర్ జిల్లాలోని షేర్ పుర్ డాకో గ్రామంలో భారీ వర్షంలోనూ రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. ఇది గమనించిన స్థానికులు రోడ్డు వేయొద్దని అడ్డుకున్నారు. అయినా వినిపించుకోకుండా జూనియర్ ఇంజినీర్లు అదే తీరుగా వ్యహరించారు. దీంతో స్థానికులు ఆగ్రహించి రోడ్డు నిర్మాణ పనుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై స్పందించి పంజాబ్ సర్కార్ వారిపై చర్యలు తీసుకుంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఆ నలుగురు జూనియర్ ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక పంజాబ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొహాలీ, లుథియానాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రైనేజీలు నిండిపోవడంతో.. ఇళ్లల్లోకి వరద చేరింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచింది. మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయని.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద పోయేందుకు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.