నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఆక్సిడెంట్ అయ్యింది. ఓ కారు లారీని ఓవర్ టేక్ చేయబోయి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురి అక్కడిక్కడే మృతిచెందారు.ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు.బాధితులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం వాసులుగా గుర్తించారు.చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.