లారీని ఢీకొట్టిన కంటెయినర్‌‌‌‌.. ఇద్దరు మృతి

  • మరో ముగ్గురికి గాయాలు
  • సంగారెడ్డి జిల్లా సదాశివపేట శివారులో ప్రమాదం

సదాశివపేట, వెలుగు : టైర్‌‌‌‌ పంక్చర్‌‌‌‌ కావడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని మరో కంటెయినర్‌‌‌‌ లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివారులోని నిజాంపూర్‌‌‌‌ చౌరస్తా వద్ద సోమవారం జరిగింది. సీఐ మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌‌‌‌ నుంచి జహీరాబాద్‌‌‌‌ వెళ్తున్న ఓ లారీ టైర్‌‌‌‌ పంక్చర్‌‌‌‌ కావడంతో నిజాంపూర్‌‌‌‌ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన ఆపేశారు. ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌కు చెందిన లారీ డ్రైవర్‌‌‌‌, క్లీనర్‌‌‌‌ దీపక్‌‌‌‌ (45), పరమేశ్వర్‌‌‌‌ (38) కలిసి టైర్‌‌‌‌ను మారుస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌కు చెందిన ఓ కంటెయినర్‌‌‌‌ లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో దీపక్‌‌‌‌, పరమేశ్వర్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయారు. కంటెయినర్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌ యోగేశ్‌‌‌‌, క్లీనర్లు శేఖర్‌‌‌‌, దేవీసింగ్‌‌‌‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని సంగారెడ్డి హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ తెలిపారు.